విశ్వంభరకు విలన్ దొరికాడు
భోళా శంకర్ డిజాస్టర్ తర్వాత చిరంజీవి, యంగ్ డైరెక్టర్ వశిష్ఠ దర్శకత్వంలో సినిమా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా విశ్వంభర అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతుంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ మొదలైపోయింది. ఒక షెడ్యూల్ కూడా పూర్తి చేశారు. సంక్రాంతి తర్వాత మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ సినిమా షూటింగ్ లో జాయిన్ కానున్నాడని మొన్నటి వరకు అన్నారు కానీ తాజా సమాచారం ప్రకారం ఫిబ్రవరి నుంచి చిరూ షూటింగ్ లో పాల్గొననున్నాడని తెలుస్తోంది.
అయితే ఈ సినిమాలో ముందుగా విలన్ రోల్ కోసం రానాను అనుకున్నట్లు వార్తలొచ్చాయి. ప్రాథమికంగా కథా చర్చలు కూడా జరిగినట్లున్నాయి. అయితే డేట్ల సమస్యతో పాటూ కొన్ని ఇతర కారణాల వల్ల రానా డ్రాప్ అయ్యాడని తెలుస్తోంది. ఇప్పుడా ప్లేస్ లోకి బాలీవుడ్ విలన్ కునాల్ కిషోర్ కపూర్ వచ్చినట్లు తెలుస్తోంది.
నాగార్జున-నాని కాంబోలో వచ్చిన దేవదాస్ తో ఈయన తెలుగులోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పుడు మళ్లీ విశ్వంభరతో మరోసారి తెలుగు ప్రేక్షకుల్ని పలకరించడానికి రెడీ అవుతున్నాడు. విశ్వంభరతో క్లిక్ అయితే కెరీర్ పరంగా ఆయనకు మరిన్ని అవకాశాలు టాలీవుడ్ నుంచి వచ్చే ఛాన్సుంది. ఈ విషయంలో ఇప్పటి వరకు మేకర్స్ నుంచి ఇంకా అఫీషియల్ అనౌన్స్ మెంట్ రాలేదు. త్వరలోనే మంచి ముహూర్తం చూసి కాస్టింగ్ గురించి వెల్లడించనున్నట్లు తెలుస్తోంది. సంక్రాంతికి ఈ సినిమా నుంచి టైటిల్ ను అఫీషియల్ గా అనౌన్స్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.













