బాలయ్యను టార్గెట్ చేసిన బలగం డైరెక్టర్
జబర్దస్త్ షో తో కమెడియన్ గా క్రేజ్ తెచ్చుకుని, తర్వాత మెల్లిగా సినిమా అవకాశాలు అందుకుని కమెడియన్ వేషాలు వేసిన వేణు ఎల్దండి బలగం సినిమాతో తనలోని దర్శకత్వ ప్రతిభను బయటపెట్టాడు. అసలు వేణులో ఇంత గొప్ప డైరెక్టర్ ఉన్నాడా అనేలా బలగంను తెరకెక్కించాడు వేణు.
బలగం సినిమా విషయంలో దిల్ రాజు వేణు పై ఎంత నమ్మకం పెట్టుకున్నాడో ఆ నమ్మకాన్ని సినిమాతో ప్రూవ్ చేసుకున్నాడు. ఈ సినిమా హిట్ తర్వాత వేణు తో సినిమాలు చేయడానికి హీరోలంతా ఆసక్తిగా ఉన్నారు. మంచి స్టోరీ ఉంటే చేసేద్దాం అంటున్నారు కూడా. కానీ వేణు టార్గెట్ మాత్రం వేరేగా ఉంది. తన రెండో సినిమా కోసం వేణు ఏకంగా బాలయ్యను టార్గెట్ చేశాడు.
బాలయ్య కోసం ఓ అదిరిపోయే స్టోరీని రెడీ చేసుకున్న వేణు, ఆ కథను బాలయ్యను కలిసి నెరేట్ కూడా చేశాడట. బాలయ్య ఈ కథ విని పాజిటివ్ గా రెస్పాండ్ అయినట్లు తెలుస్తుంది. వేణు బాలయ్య కోసం రాసుకున్న ఈ కథ మాస్, కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటుగా బలగం లో లానే ఓ సాఫ్ట్ పాయింట్‌ను కూడా టచ్ చేయనున్నాడట.
ఇదిలా ఉంటే వేణు తర్వాత ఏ హీరోతో సినిమా చేసినా కూడా ఆ సినిమాను దిల్ రాజు తన బ్యానర్లోనే నిర్మిస్తానని ఇంతకుముందే చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం బాలయ్య అనిల్ రావిపూడి డైరెక్షన్ లో నటిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత బాలయ్య చేయబోయే సినిమా వేణుతో నేనా అని అనుకుంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. బాలయ్య బర్త్ డే రోజున అనౌన్స్ చేసేది వేణు సినిమాయేనా అని అందరూ చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఒకవేళ ఇదే జరిగితే ఈ సినిమా క్రేజీ కాంబినేషన్ అవడం ఖాయం.













