Aswani Dut: త్వరలోనే సెట్స్ పైకి కల్కి2

ప్రస్తుతం రాజా సాబ్(raja saab), ఫౌజీ(Fauji), స్పిరిట్(Spirit) సినిమాలు చేస్తున్న ప్రభాస్(prabhas) వాటిపై ఫోకస్ చేయడం వల్లే తన సీక్వెల్ సినిమాలను లైట్ తీసుకుంటున్నారని టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం కమిట్ అయిన సినిమాలను పూర్తి చేశాకే ప్రభాస్ ఆ సీక్వెల్స్ పై దృష్టి పెట్టనున్నాడని కూడా అన్నారు. కానీ కల్కి నిర్మాత అశ్వినీదత్(Aswanidutt) మాత్రం కల్కి2(kalki2) ను త్వరలోనే సెట్స్ పైకి తీసుకెళ్లనున్నట్టు చెప్తున్నారు.
కల్కి సినిమా ఎట్టి పరిస్థితుల్లో 2026 కంటే ముందే సెట్స్ పైక వెళ్తుందని, ఈ ఏడాది ఆఖరి త్రైమాసికంలో కల్కి2ను సెట్స్ పైకి తీసుకెళ్లడానికి టీమ్ మొత్తం రెడీగా ఉందని, త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ ను మొదలుపెట్టి, వీలైనంత త్వరగా వాటిని పూర్తి చేయడానికి టీమ్ రెడీగా ఉందని చెప్తున్నారు. ఓ వైపు దత్ ఇంత నమ్మకంగా ఉంటే మరోవైపు ప్రభాస్ మాత్రం బిజీ షెడ్యూల్స్ తో ఉన్నారు.
రాజా సాబ్ షూటింగ్ ఆల్మోస్ట్ అయిపోయింది. ఫౌజీని హను రాఘవపూడి(hanu raghavapudi) 2026లో రిలీజ్ చేయాలని చూస్తుండగా, స్పిరిట్ సినిమాను ఎట్టి పరిస్థితుల్లో 2027లో రిలీజ్ చేయాలని సందీప్ రెడ్డి వంగా(sandeep reddy vanga) ప్లాన్ చేస్తున్నాడు. మరి ఇంతటి బిజీ షెడ్యూల్స్ లో ప్రభాస్ తన డేట్స్ ను కల్కి2 కోసం కేటాయించగలడా అంటే చూడాలి. కానీ దత్ మాత్రం ప్రభాస్ పై చాలా నమ్మకంతో సినిమాను త్వరలోనే మొదలుపెట్టనున్నట్టు చెప్తున్నారు. చూడాలి మరి ఏమవుతుందో.