ఆర్య, సాయేషా పెళ్లి ముహూర్తం ఖరారు
అక్కినేని అఖిల్ మొదటి సినిమా హీరోయిన్ సాయేషా సైగల్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతోంది. ఇప్పటిదాకా ఆమె ప్రేమ కథ గాలి వార్త రూపంలో చక్కర్లు కొడుతూనే ఉంది. దానికి ఆఫీషియల్‌గా చెక్ పెట్టేసారు. తమిళ్ హీరో ఆర్యను సాయేషా పెళ్లి చేసుకోనుంది. హైదరాబాద్‌లో ఈ వివాహం జరుగనుండడం విశేషం. మార్చి 9, 10 తేదీలలో వీరి పెళ్లి, రిసెప్షన్ జరుగనుంది. అయితే పెళ్లి గురించి వీరిద్దరూ ప్రకటించలేదు కానీ ఈ మేరకు తమకు సన్నిహితంగా ఉండే కోలీవుడ్, టాలీవుడ్ హీరోహీరోయిన్లకు, నటీనటులు, సినీ ప్రముఖులకు సమాచారం ఇచ్చారట. కోలీవుడ్‌లో ఆర్య, సాయేషాల లవ్ స్టోరీ చాలా నెలల నుంచి హాట్ టాపిక్‌గా ఉంది. చివరికి వీర్దిదరు పెద్దల సమ్మతిలో పెళ్లి చేసుకోబోతున్నారు.













