Anirudh: అనిరుధ్‌కి రెహమాన్ సలహా
సౌత్ లో మంచి డిమాండ్ ఉన్న మ్యూజిక్ డైరెక్టర్లలో అనిరుధ్(Anirudh) పేరు ముందుగా వినిపిస్తుంది. ఎన్నో సినిమాలను కేవలం తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో ఎలివేట్ చేయడం అనిరుధ్ స్పెషాలిటీ. విక్రమ్(Vikram), జైలర్(Jailer), లియో(Leo), దేవర(Devara) లాంటి ఎన్నో సినిమాలను తన వర్క్ తో నిలబెట్టాడు అనిరుధ్. అందుకే అనిరుధ్ డేట్స్ ఖాళీ లేకపోయినా, లేటవుతుందని చెప్పినా సరే దర్శకనిర్మాతలు తన కోసం వెయిట్ చేసేందుకు రెడీగా ఉన్నారు.
ప్రస్తుతం అనిరుధ్ తెలుగులో గౌతమ్ తిన్ననూరి(Gowtham Thinnanuri) దర్శకత్వంలో వస్తున్న వీడీ12(VD12), మేజిక్(Magic) సినిమాలకు సంగీతం అందిస్తున్నాడు. అయితే ప్రస్తుతానికి అనిరుధ్ సాంగ్స్ యూట్యూబ్ ని, సోషల్ మీడియాని, థియేటర్లను షేక్ చేసినా తన పాటలకు లాంగ్ లైఫ్ లేదనే కామెంట్ మాత్రం అనిరుధ్ మ్యూజిక్ పై ఉంది. ఈ నేపథ్యంలో అనిరుధ్‌కి ఏఆర్ రెహమాన్(AR Rahman) ఓ సలహా ఇచ్చాడు.
రీసెంట్ గా కాదలిక్క నేరమిల్లై ప్రీ రిలీజ్ ఈవెంట్ కు గెస్టుగా వచ్చిన అనిరుధ్‌ని ఉద్దేశించి రెహమాన్ మాట్లాడాడు. అనిరుధ్ మ్యూజిక్ ని, పనితనాన్ని పొగిడిన రెహమాన్, క్లాసికల్ టచ్, రాగాలను ఆధారంగా చేసే ఎక్స్పెరిమెంట్స్ ఎక్కువ కాలం నిలుస్తాయని అలాంటివి కంపోజ్ చేయమని అనిరుధ్ కి సలహా ఇచ్చాడు. రెహమాన్ చెప్పిన పాయింట్ ముమ్మాటికీ నిజమే. ఎందుకంటే ఒకప్పటిలా ఇప్పటి ఆడియోలకు లాంగ్ లైఫ్ లేదు. రెహమాన్ చెప్పిన ఫార్ములాని పాటిస్తే అనిరుధ్ గొప్ప రిజల్ట్స్ అందుకునే ఛాన్స్ ఉంది.













