కమల్ సరసన అనుష్క!
అనుష్క తాజాగా ఓ పెద్ద ఆఫర్‌ను అందిపుచ్చుకుందని సమాచారం. కమల్ హాసన్, గౌతమ్ మీనన్ కాంబినేషన్లో రూపొందిన చిత్రం రాఘవన్. విశేష ప్రేక్షకాదరణతో ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. దీనికి సీక్వెల్‌గా రాఘవన్ 2 చిత్రాన్ని రూపొందించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సీక్వెల్లో కమల్‌హాసన్ సరసన అనుష్క నటించనుంది. ఈ చిత్రకథ, ఇందులోని తన పాత్ర నచ్చడంతో పాటు తొలిసారి కమల్ సరసన నటించే అవకాశం రావడం.. వీటిని దృష్టిలో పెట్టుకుని అనుష్క కూడా ఈ ప్రాజెక్ట్‌కి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిందని తెలుస్తోంది. కమల్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ఇండియన్ 2 చిత్రంలో నటిస్తున్న విషయం విదితమే. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో రూపొందిన ఇండియన్ చిత్రానికిది సీక్వెల్. ప్రస్తుతం కొనసాగుతున్న లాక్డౌన్ కారణంగా ఈ చిత్ర షూటింగ్ నిలిచిపోయింది.













