Anirudh: రామ్ పాట కోసం అనిరుధ్

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని(ram pothineni) గత కొన్ని సినిమాలుగా వరుస ఫ్లాపుల్లో ఉన్నాడు. సినిమా సినిమాకీ ఆశ పెట్టుకోవడం ఆ సినిమా ఫ్లాపవడం చాలా మామూలైంది. దీంతో నెక్ట్స్ మూవీతో ఎలాగైనా హిట్ అందుకోవాలని చాలా కసిగా ఉన్నాడు రామ్. అందులో భాగంగానే తన తర్వాతి సినిమాను మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి(Miss Shetty Mr Polishetty) డైరెక్టర్ మహేష్ బాబు(mahesh babu) దర్శకత్వంలో చేస్తున్నాడు.
భాగ్య శ్రీ బోర్సే(Bhagya sri borse) హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో కన్నడ స్టార్ ఉపేంద్ర(Upendra) హీరో సూర్య కుమార్ గా కనిపించనున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇదిలా ఉంటే ఈ సినిమా కోసం హీరో రామ్ లిరిక్ రైటర్ గా మారి ఓ పాటను రాస్తున్నట్టు ఇప్పటికే పలు వార్తలొచ్చిన సంగతి తెలిసిందే.
ఆంధ్రా కింగ్ తాలూకా(Andhra king thaluka) అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా గురించి ఇప్పుడో వార్త వినిపిస్తోంది. ఈ మూవీలో రామ్ రాస్తున్న పాటను సౌత్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్(Anirudh) పాడనున్నాడని అంటున్నారు. ఇప్పటికే ఎంతోమంది మ్యూజిక్ డైరెక్టర్లు కంపోజ్ చేసిన సాంగ్స్ ను పాడి వాటిని తన వాయిస్ తో నెక్ట్స్ లెవెల్ కు తీసుకెళ్లిన అనిరుధ్ ఇప్పుడు రామ్ కోసం పాట పాడనున్నట్టు తెలుస్తోంది. వివేక్(Vivek)- మార్విన్(Marvic) సంగీతం అందిస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్(mythri movie makers) భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.