Andhra King Taluka: ‘ఆంధ్ర కింగ్ తాలూకా’కు అద్భుతమైన రెస్పాన్స్ ఇచ్చిన ఆడియన్స్ కి థాంక్ యూ: ఉపేంద్ర
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని లేటెస్ట్ బ్లాక్ బస్టర్ ‘ఆంధ్ర కింగ్ తాలూకా’. పాన్ ఇండియా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రానికి మహేశ్ బాబు పి దర్శకత్వం వహించారు. భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటించగా, కన్నడ సూపర్‌స్టార్ ఉపేంద్ర ఆన్-స్క్రీన్ సూపర్‌స్టార్ పాత్రను పోషించారు. ఈ చిత్రం నవంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలై బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ తో హౌస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ బ్లాక్ బస్టర్ ప్రెస్ మీట్ ని నిర్వహించారు.
ప్రెస్ మీట్ లో రియల్ స్టార్ ఉపేంద్ర మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. ఈ కథ విన్నప్పుడే థ్రిల్ అయిపోయాను. ఎమోషనల్ గా అద్భుతంగా అనిపించింది. కానీ టైటిల్ ఆంధ్ర కింగ్ అని చెప్పినప్పుడు కాస్త టెన్షన్ అనిపించింది. నేను ఎలా ఆంధ్ర కింగ్ అవుతాను అనిపించింది. కానీ ఇప్పుడు అనిపిస్తుంది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆంధ్ర కింగ్స్. నేను కింగ్ లాగా ఫీల్ అవుతున్నాను అంటే అది మీ గొప్పతనం. అంత పెద్ద మనసు మీది. నేను గత 25 ఏళ్లుగా ఎప్పుడు ఇక్కడికి వచ్చినా ఇది నా ప్లేస్ అనిపిస్తుంది. మైత్రి మూవీ మేకర్స్ లో ఫస్ట్ టైం వర్క్ చేయడం చాలా ఆనందంగా అనిపించింది. ఇది ఒక మంచి అవకాశంగా భావిస్తున్నాను. డైరెక్టర్ మహేష్ గారు అద్భుతమైన సినిమా తీశారు. హీరో ఫ్యాన్ మధ్య వున్న డివైన్ ఎమోషన్ ని అద్భుతంగా చూపించారు. నా ఫ్యాన్ సాగర్(రామ్) మహాలక్ష్మి(భాగ్యశ్రీ) అమెరికాలో సినిమా ప్రమోట్ చేస్తున్నారు. ఇప్పుడు కూడా ఫ్యాన్ ని అక్కడ పెట్టారు(నవ్వుతూ). సినిమాకి ఇంత అద్భుతమైన రెస్పాన్స్ ఇచ్చిన ఆడియన్స్ కి థాంక్యూ.
డైరెక్టర్ మహేష్ బాబు పి మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. సినిమాకి ప్రేక్షకులు మీడియా నుంచి చాలా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. చిన్నచిన్న డీటెయిల్స్ కూడా అబ్జర్వ్ చేసి వాటి గురించి ప్రేక్షకులు చెప్తుంటే చాలా ఆనందంగా అనిపించింది. మ్యూజిక్, ఆర్ట్ డైరెక్టర్ అవినాష్, ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ గారు, డిఓపి సిద్ధార్థ అందరికీ మంచి పేరు వచ్చింది. రావు రమేష్ గారు తులసి గారు మురళి శర్మగారు ఇలా అందరి గురించి కూడా రివ్యూస్ లో అద్భుతంగా రాస్తున్నారు. ప్రతి క్యారెక్టర్ కి ఒక కంప్లీట్ నెస్ ఉంది. రామ్ గారు ఉపేంద్ర గారు మ్యాజిక్ చేశారు. ఒక మంచి టీం తో ప్రయాణం చేసినప్పుడు వండర్స్ జరుగుతాయి. అలాంటి వండర్ ఆంధ్ర కింగ్ తాలూకా. ఈ కథ విన్నప్పటి నుంచి ఇప్పటివరకు నన్ను ఒక బ్రదర్ లా చూసుకున్న మైత్రి మూవీ మేకర్స్ రవి గారికి నవీన్ గారికి థాంక్యూ. వాళ్లతో నేను ఎమోషనల్ గా చాలా కనెక్ట్ అయ్యాను. అందరికీ థాంక్యు.
నిర్మాత రవిశంకర్ మాట్లాడుతూ ..అందరికి నమస్కారం. మా సినిమాని సపోర్ట్ చేసిన మీడియా మిత్రులందరికీ ప్రత్యేకంగా థాంక్స్. ఈ సినిమాకి వచ్చిన రెస్పాన్స్ చాలా అద్భుతంగా ఉంది. సినిమా గురించి ప్రతి ఒక్కరూ చాలా డీటెయిల్ గా మాట్లాడుతున్నారు. రామ్ గారు ఉపేంద్ర గారి కాంబినేషన్లో సీన్స్ గురించి, పెర్ఫార్మన్స్ గురించి అద్భుతమైనఅప్రిషియేషన్స్ వస్తున్నాయి. అలాగే మా మ్యూజిక్, డిఓపి సిద్ధార్థ, అవినాష్ కొల్ల గారి ప్రొడక్షన్ డిజైన్, శ్రీకర్ ప్రసాద్ గారి ఎడిటింగ్ ఇలా టెక్నీషియన్స్ అందరూ గ్రేట్ వర్క్ ఇచ్చారు. డైరెక్టర్ మహేష్ బాబు గారికి చాలా గొప్ప పేరు వచ్చింది. రైటింగ్ డైరెక్షన్ అద్భుతంగా చేశారు. ప్రతి షో గ్రాడ్యువల్ గా పెరుగుతూనే వెళుతుంది. శుక్రవారం మార్నింగ్ నుంచి అన్ని వైపుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ వీకెండ్ అంతా సూపర్ గా ఉంటుంది. ఇది చాలా లాంగ్ రన్ ఉన్న సినిమా. మూడు వారాలు అద్భుతంగా పెర్ఫాం చేస్తుందని అందరం నమ్ముతున్నాం. రామ్ గారు యూఎస్ లో సినిమాని అద్భుతంగా ప్రమోట్ చేస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన ప్రతి ఈవెంట్ ని సక్సెస్ఫుల్ బ్రహ్మాండంగా చేసాం. మేము ఆశించిన ఫలితం దక్కింది. రామ్ గారు వచ్చిన తర్వాత ఈ సినిమా కోసం టూర్ కూడా ప్లాన్ చేస్తున్నాం. పోస్ట్ రిలీజ్ ప్రమోషన్స్ కూడా చాలా అద్భుతంగా ఉండబోతున్నాయి. ఇది కేవలం ఫ్యాన్స్ కి మాత్రమే కాదు ఫ్యామిలీస్, పిల్లలు, యూత్ అందరూ ఎంజాయ్ చేసే కథ. ఇందులో ఉండే హ్యూమన్ ఎమోషన్స్ అద్భుతంగా వున్నాయి. అందరకీ నచ్చి మెచ్చే సినిమా. ఈ వీకెండ్ లో అందరూ థియేటర్స్ లో ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను.
ఎస్కేఎన్ మాట్లాడుతూ.. ఈ సినిమాకి నేను చాలా కనెక్ట్ అయ్యాను. నిన్న నైట్ నుంచి అన్ని షోస్ పికప్ పై హౌస్ ఫుల్ గా వెళుతుంది. సినిమా అనేది ఒక హీరోకి ఫ్యాన్ కి మధ్య నడిచే ఎమోషన్. ఆ ఎమోషన్ మీద ఇప్పటివరకు తెలుగులో ఏ సినిమా రాలేదు. ఆ ఎమోషన్ అద్భుతంగా చూపించిన సినిమా ఆంధ్ర కింగ్ తాలూకా. ఈ సినిమా చూస్తున్నప్పుడు నిజ జీవితంలో పాత్రలే కనిపించాయి. ఉపేంద్ర గారుగారిని స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు చాలా ఇన్స్పైరింగ్ గా అనిపించింది. రామ్ గారిని చూస్తున్నప్పుడు మనల్ని మనం చూసుకున్నట్టుగా అనిపించింది. ఈ సినిమా చూస్తున్నప్పుడు నా జీవితాన్నే చూసుకున్నట్టుగా అనిపించింది. నేను నమ్మిన నా హీరోకి గౌరవం తీసుకురావాలని నా భావన. మైత్రి భూమి మేకర్స్ మంచి కథా బలం ఉన్న సినిమాలను తీస్తారు. ఇంత గొప్ప సినిమా అందరూ చూడాలి. ప్రతి ఫ్యాను కనెక్ట్ అవ్వాలి. ఈ సినిమా ఒక ల్యాండ్ మార్క్ గా నిలవాలని కోరుకుంటున్నాను.
మ్యూజిక్ డైరెక్టర్ వివేక్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఈ సినిమా టైటిల్ అనౌన్స్ చేసినప్పటి నుంచి అద్భుతమైన పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చిన ప్రేక్షకులకి మీడియాకి థాంక్యూ. తెలుగు ప్రేక్షకులు చాలా గొప్ప మనసున్న ప్రేక్షకులు. ఆ గొప్ప మనసుని మేము ఎక్స్పీరియన్స్ చేశాం. మాకు ఈ అవకాశం ఇచ్చిన మైత్రి మూవీ మేకర్స్ కి హీరో రామ్ గారికి ఉపేంద్ర గారికి అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు.
మ్యూజిక్ డైరెక్టర్ మర్విన్ మాట్లాడుతూ.. మీడియాకి థాంక్యూ. ఇది మా ఫస్ట్ తెలుగు సినిమా. చాలా ఎమోషనల్ మూమెంట్. మైత్రి మూవీ మేకర్స్ లాంటి పెద్ద సంస్థలో ఫస్ట్ తెలుగు సినిమా చేయడం, ఆ సినిమాకి మ్యూజిక్ కి ఎంత అద్భుతమైన రెస్పాన్స్ ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. ఫ్యామిలీ కిడ్స్ అందరూ ఈ సినిమాని అద్భుతంగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇది జస్ట్ బిగినింగ్ మాత్రమే. సినిమా ఇంకా అద్భుతంగా ఉండబోతుంది.






