Rashmika: రష్మికపై అభిమానాన్ని బయటపెట్టిన ఆనంద్ దేవరకొండ
రష్మిక మందన్నా(Rashmika Mandanna), విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) మధ్య బంధం గురించి సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో డిస్కషన్స్ జరుగుతుంటాయి. విజయ్ ఏ వెకేషన్ కు వెళ్లినా తనతో పాటూ రష్మిక వెళ్లడం, రష్మిక పోస్ట్ చేసిన ప్లేస్ లోనే విజయ్ ఫోటోలు కూడా ఉండటంతో వీరిద్దరూ ఎప్పటినుంచో రిలేషన్లో ఉంటున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.
అయితే రష్మికకు విజయ్ తోనే కాకుండా అతని ఫ్యామిలీతో కూడా మంచి అనుబంధముంది. విజయ్ తమ్ముడు ఆనంద్ దేవరకొండ(Anand Devarakonda) నటించిన ఎన్నో సినిమాలను ప్రమోట్ చేయడంతో పాటూ ప్రీ రిలీజ్ ఈవెంట్స్‌కు, మూవీ ప్రీమియర్లకు కూడా రష్మిక వెళ్లింది. రీసెంట్ గా విజయ్ తల్లి మాధవి(Madhavi), రష్మిక కు గులాబీ పూలు పంపి, ఆమె ప్రేమను బయటపెట్టగా ఇప్పుడు విజయ్ తమ్ముడు ఆనంద్ కూడా రష్మికపై తన అభిమానాన్ని చాటుకున్నాడు.
ఛావా(Chhava) సినిమాతో రష్మిక వరుసగా మూడు హిట్స్ అందుకున్న సందర్భంగా ఆనంద్.. రష్మికకు విషెస్ చెప్తూ,వర్క్ పైన నీకున్న క్రమశిక్షణ, డెడికేషనే నీకు ఈ భారీ విజయాల్ని తెచ్చిపెట్టాయని రాసి ఓ ఫోటోను షేర్ చేశాడు. దానికి రష్మిక మూడు హార్ట్ ఎమోజీలతో ఆనంద్ పోస్ట్ ను రీషేర్ చేసి దేవరకొండ ఫ్యామిలీతో తనకున్న రిలేషన్‌ను మరింత బలోపేతం చేసింది. ఇదంతా చూసి రష్మిక, విజయ్ కలిసి ఆ గుడ్ న్యూస్ ఎప్పుడు చెప్తారా అని ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు.













