Allari Naresh: హీరోయిన్ కు అల్లరి నరేష్ సలహా
ఎప్పుడైనా మూవీ ఇండస్ట్రీలో హీరోలకు ఉన్నంత కెరీర్, లైఫ్ టైమ్ హీరోయిన్లకు ఉండదనేది ఒప్పుకోవాల్సిన వాస్తవం. హీరోయిన్లు ఎంత ఫాస్ట్ గా సక్సెస్ అవుతారో అంతే ఫాస్ట్ గా ఫేడవుట్ అవుతారు. ప్రతీ వారం కొత్త హీరోయిన్లు వస్తూనే ఉంటారు, పాత వాళ్లు కొత్త ఛాన్స్ లను అందుకుంటూ తమ ఫేమ్ ను మరింత పెంచుకుంటూనే ఉంటారు. కానీ తెలుగమ్మాయిలకు మాత్రం తగిన అవకాశాలు ఇవ్వరని ఎప్పుడూ అంటూ ఉంటారు.
అయితే ఈ విషయంలో తాజాగా టాలీవుడ్ హీరో అల్లరి నరేష్(Allari naresh) తన సినిమా 12ఎ రైల్వే కాలనీ(12A Railway colony) ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడాడు. నాని కాసరగడ్డ(nani kasaragadda) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో కామాక్షి భాస్కర్ల(kamakshi bhaskarla) హీరోయిన్ గా నటించగా, ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కామాక్షి గురించి మాట్లాడుతూ, ఆమె ఎంతో టాలెంటెడ్ అని, యాక్టింగ్ మాత్రమే కాకుండా అన్ని విభాగాల్లో యాక్టివ్ గా ఉంటుందని చెప్పారు.
కామాక్షి తెలుగమ్మాయి అనే విషయాన్ని ప్రస్తావిస్తూ, తెలుగమ్మాయిలకు అవకాశాలు వచ్చే వరకు రాలేదంటారు అని, అవకాశాలు వచ్చాక వేరే భాషలకు వెళ్లిపోతారని, కానీ కామాక్షి నువ్వు అలా వెళ్లొద్దు, అవకాశముంటే బయట ట్రై చేస్తూనే ఇక్కడ కూడా సినిమాలు చెయ్ కానీ మొత్తానికి ఇక్కడ వదిలేసి వెళ్లిపోకు అని సలహా ఇవ్వగా ఇప్పుడా కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
https://www.instagram.com/reel/DRL0G7XldPq/?igsh=bG8xNXd0b2hzaWwz













