సీతగా నటిస్తున్న అలియా బట్
సీతగా నటిస్తున్న అలియా బట్ అనగానే రామాయణం లో సీత పాత్ర అనుకునేరు. రాజా మౌళి RRR సినిమా కోసం…. ఈ సినిమా గురించి గత కొన్ని నెలలుగా టాలీవుడ్ ఇండస్ట్రీలో చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఇక ఈ సినిమాకు సంబంధించి ఏ చిన్న విషయం సోషల్ మీడియాలో పోస్ట్ చేసినా అది హాట్ టాపిక్ గా మారుతుంది. దీనికి కారణం దర్శాదుడు రాజా మౌళి, ప్రస్తుత టాలీవుడ్ అగ్ర హీరోలు రామ్ చరణ్, జూనియర్. ఎన్టీఆర్. ఇక ఎన్టీఆర్,రామ్ చరణ్ వంటి మాస్ హీరోలతో చేస్తోన్న భారీ మల్టీస్టారర్ పై ఇండియన్ సినిమా ఇండస్ట్రీ అంతా ఇప్పుడు ఈ సినిమాపై ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇక ఈ సినిమాలో హీరోయిన్ ల విషయానికొస్తే ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ నటిస్తుండగా మరోవైపు జూ. ఎన్టీఆర్ సరసన ఒలీవియా మోరీస్ నటిస్తోంది. అయితే ప్రస్తుతం కరోనా కారణంగా ఈ చిత్రానికి సంబంధించిన అన్ని షూటింగ్ పనులు వాయిదాపడిన విషయం తెలిసిందే. దీనితో ఇప్పుడు ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని 2021, ఏప్రిల్ 28న విడుదల చేయాలనే ప్లాన్ లో ఉన్నారు చిత్ర యూనిట్ ఇటీవల తాజాగా RRR చిత్రంలో అలియా భట్ పాత్రపై క్లారిటీ ఇచ్చారు
దర్శక ధీరుడు రాజమౌళి.RRR సినిమాలో సీత పాత్ర కోసం ఎన్టీఆర్, రామ్ చరణ్ మధ్య కలిసి నటించగలిగే నటి నాకు కావాలని, అది ఎందుకంటే వీళ్లిద్దరు ఎంతో టాలెంట్ ఉన్న నటులు కాబట్టి సీత పాత్ర అమాయకంగా ఉండాలి అంతేకూండా గడుసుదనం కూడా ఉండాలి అని ఆయన తెలిపాడు. కాబట్టి ఈ పాత్ర కోసం ఆలియాను ఎంపిక చేసినట్టు ఆయన విషయాన్నీ చెప్పుకొచ్చారు. ఈ సినిమాలో ఆలియా భట్ రామరాజు మరదలు సీతగా కనిపించి ప్రేక్షకులను తన నటనతో అమాంతం ఆకట్టుకుంటుందని ఖాయం అని ఆయన తెలిపారు. సూపర్ స్టార్ కృష్ణ అల్లూరి సీతారామరాజు చిత్రంలో సీతగా విజయ నిర్మల నటించారు అయితే ఆ చిత్రంలో సీత పెళ్లి మడపంలోనే ప్రాణాలు విడుస్తుంది మరి సీత కథను ఏ విధంగా ముగిస్తాడో రాజమౌళి సార్.













