ఇలా కూడా రికార్డ్ క్రియేట్ చెయ్యొచ్చు అని ప్రూవ్ చేసిన మహేష్‌భట్!
1974లో `మంజిలే ఔర్ భి హై` చిత్రంతో దర్శకుడిగా బాలీవుడ్లో పరిచయమైన మహేష్ భట్ 25 సంవత్సరాలపాటు దర్శకుడిగా ఎన్నో మంచి సినిమాలు ప్రేక్షకులకు అందించాడు. 1999లో సంజయ్‌దత్, జాకీష్రాఫ్‌తో రూపొందించిన `కార్తూస్` దర్శకుడిగా ఆయన చివరి సినిమా. దాదాపు 20 సంవత్సరాలపాటు దర్శకత్వం జోలికి వెళ్ళలేదు. చాలా సినిమాలకు నిర్మాతగా వ్యవహరించాడు. ఈ నేపథ్యంలో మహేష్‌భట్ నెపోటిజంను బాగా ప్రోత్సహిస్తున్నాడని పలు ఆరోపణలు ఎదుర్కొన్నాడు. చాలా వివాదాల్లో కూడా ఇరుక్కున్నాడు. ఇటీవల బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్యతో నెపొటిజం గురించి అందరూ మాట్లాడడం మొదలుపెట్టారు. వారసత్వం వల్ల ఎంతో మంది ప్రతిభగల నటీనటులు అవకాశాలు కోల్పోతున్నారనే విమర్శలు వచ్చాయి. మహేష్ భట్ కూడా ఈ విషయంలో ఆరోపణలు ఎదుర్కొన్నాడు.
ఇదిలా ఉంటే 1999లో చివరి సినిమాను డైరెక్ట్ చేసిన మహేష్‌భట్ మళ్లీ మెగా ఫోన్ అందుకొని 1991లో తన దర్శకత్వంలోనే వచ్చిన `సడక్` చిత్రానికి సీక్వెల్‌గా `సడక్2`చిత్రాన్ని రూపొందించాడు. ఈ సినిమాలో మహేష్‌భట్ కుమార్తెలు పూజాభట్, అలియా భట్ కూడా నటించారు. ఈ సినిమా ఈ ఏడాది ఆగస్ట్ 28న ఓటీటీ ద్వారా విడుదలైంది. 20 సంవత్సరాల తర్వాత మహేష్‌భట్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను ఆయుధంగా వాడుకున్నారు నెటిజన్లు. `సడక్2` చిత్రాన్ని ఎంత అన్‌పాపులర్ చెయ్యాలో అంత చేశారు. ఈ సినిమా ట్రైలర్‌కు యూ ట్యూబ్‌లో 7 లక్షల లైక్స్ రాగా, అన్ లైక్స్ 13 మిలియన్ వచ్చాయి. ఇది ఇప్పటికి, ఎప్పటికీ రికార్డ్‌గానే కొనసాగే అవకాశం ఉంది. ఎంత చెత్త సినిమాకైనా లైక్స్‌లో, అన్ లైక్స్‌లో ఇంత వేరియేషన్ ఉండదు. కేవలం మహేష్ భట్‌ను దృష్టిలో పెట్టుకొనే రికార్డు స్థాయిలో అన్‌లైక్స్ ఇచ్చారు. ఈ అన్లైక్స్ను 20 మిలియన్లు దాటించాలన్నది మహేష్‌భట్ వ్యతిరేక వర్గం టార్గెట్ అని తెలుస్తోంది. మరి ఈ విషయంలో మహేష్‌భట్ ఎలా స్పందిస్తాడో చూడాలి.













