ఆర్ఆర్ఆర్ టీమ్ లోకి ఆలియా భట్ ఎంటర్ అయ్యింది
బాలీవుడ్ నటి ఆలియా భట్ ఆర్ ఆర్ ఆర్ షూటింగ్లో పాల్గొంటున్నారు. ఈ విషయాన్ని ఆలియా ఇన్స్టాగ్రామ్ స్టోరీ ద్వారా వెల్లడించారు. బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ ఎట్టకేలకు ఆర్ ఆర్ ఆర్ టీంతో జాయిన్ అయ్యారు. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రంలో ఆలియా భట్ ఒక హీరోయిన్గా నటిస్తోన్న సంగతి తెలిసిందే. నవంబర్లోనే ఆలియా షూటింగ్లో పాల్గొంటారని వార్తలు వచ్చాయి. అయితే, తాను ఆర్ఆర్ఆర్ షూటింగ్లో పాల్గొనబోతున్నట్టు ఆలియా ఆదివారం ప్రకటించారు. ఈ మేరకు ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఒక చిన్న వీడియోను పోస్ట్ చేశారు. రేపటి నుంచి ఆలియా ఆర్ఆర్ఆర్షూటింగ్లో పాల్గొనబోతున్నట్టు సమాచారం. భారీ పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతోన్న ఈ చిత్రం షూటింగ్ లాక్డౌన్ కారణంగా సుమారు ఏడు నెలలపాటు ఆగిపోయిన విషయం తెలిసిందే. సుధీర్ఘ విరామం తరవాత అక్టోబర్ 5 నుంచి షూటింగ్‌ను తిరిగి ప్రారంభించారు.
హైదరాబాద్‌లో 50 రోజుల షెడ్యూల్ అనంతరం ఆర్ఆర్ఆర్ టీం మహారాష్ట్రకు బయలుదేరింది. పుణే, మహాబలేశ్వరంలో షూటింగ్ చేయడానికి వెళ్లింది. ఇప్పటికే మహాబలేశ్వరంలో చిన్న షెడ్యూల్‌ను ఆర్ఆర్ఆర్ టీం పూర్తిచేసింది. రామ్ చరణ్, ఎన్టీఆర్‌పై అక్కడ కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. కాగా, ఆర్ ఆర్ ఆర్ ద్వారా ఆలియా భట్ తెలుగు పరిశ్రమకు పరిచయమవుతున్నారు. రామ్ చరణ్‌కు జంటగా ఆలియా భట్ నటిస్తున్నారు. రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తుండగా.. ఆలియా భట్ సీతగా కనిపించనున్నారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్ర పోషిస్తున్నారు. శ్రియా శరణ్, అజయ్ దేవగణ్ అతిథి పాత్రలో కనిపిస్తారు. వచ్చే ఏడాది ఈ చిత్రం విడుదలవుతుంది.













