Haiwaan: “హైవాన్” ఈ చిత్రంతో గ్రేట్ జర్నీ చేస్తున్నానంటూ వెల్లడించిన స్టార్ హీరో

అక్షయ్ కుమార్ (Akshay Kumar), సైఫ్ అలీఖాన్ ప్రధాన పాత్రల్లో ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్ రూపొందిస్తున్న సినిమా “హైవాన్” (Haiwaan). సరికొత్త థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని కేవీఎన్ ప్రొడక్షన్స్, తెస్పియన్ ఫిలింస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ ప్రెస్టీజియస్ మూవీతో ఫస్ట్ టైమ్ నెగిటివ్ క్యారెక్టర్ లో నటిస్తున్నారు అక్షయ్ కుమార్. తాజాగా “హైవాన్” సినిమా లాస్ట్ షెడ్యూల్ షూటింగ్ ప్రారంభమైంది. ఈ సందర్బంగా ఓ స్పెషల్ వీడియోను సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు అక్షయ్ కుమార్.
ఈ వీడియోలో అక్షయ్ కుమార్ స్పందిస్తూ – “హైవాన్” మూవీతో ఒక గ్రేట్ జర్నీ చేస్తున్నా. ఈ చిత్రంలో నటిస్తున్న క్యారెక్టర్ అనేక అంశాల్లో నన్ను ఆశ్చర్యపరుస్తోంది. ఇలాంటి రోల్ లో నటించే అవకాశం కల్పించిన డైరెక్టర్ ప్రియదర్శన్ కు థ్యాంక్స్. ఆయన మూవీ సెట్ లో ఉంటే ఇంట్లో ఉన్న ఫీల్ కలుగుతుంది. సైఫ్ తో కలిసి నటించడాన్ని ఎంజాయ్ చేస్తున్నా. అంటూ పేర్కొన్నారు.
హైవాన్ మూవీతో అక్షయ్ కుమార్, సైఫ్ అలీఖాన్ 17 ఏళ్ల తర్వాత కలిసి నటిస్తున్నారు. హైవాన్ చిత్రాన్ని టాప్ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో నిర్మిస్తున్నారు నిర్మాతలు వెంకట్ కె నారాయణ, శైలజా దేశాయ్ ఫెన్.