Akshay Kumar: సక్సెస్ కు చేరువ కాలేకపోతున్న అక్షయ్

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్(Akshay Kumar)కు గత కొంతకాలంగా ఏం చేసినా అస్సలు కలిసి రావడం లేదు. వరుస ఫ్లాపులతో అక్షయ్ ఇబ్బందులు పడుతున్నారు. మధ్యలో ఓఎంజీ2(OMG2)తో సూపర్ హిట్ అందుకున్నా ఆ తర్వాత మళ్లీ ఫ్లాపులు ఊపందుకున్నాయి. ఎప్పటికప్పుడు సక్సెస్ కోసం అక్షయ్ కష్టపడుతూనే ఉన్నప్పటికీ అతనికి సక్సెస్ మాత్రం దరిచేరడం లేదు.
దీంతో సూపర్ హిట్ ఫ్రాంచైజ్ లో వచ్చిన ఎల్ఎల్‌బీ3(LLB3)పైనే ఆయన, అతని ఫ్యాన్స్ ఆశలు పెట్టుకున్నారు. అక్షయ్ ఫ్లాపులను ఎల్ఎల్‌బీ3 ఫుల్ స్టాప్ పెడుతుందనుకుంటే ఇది కూడా నిరాశనే మిగిల్చేట్టుంది. ఈ సినిమా కథ పరంగా మంచి సబ్జెక్టే అయినా దాన్ని డైరెక్టర్ ఎగ్జిక్యూట్ చేసే విధానంలో పడిన తడబాటు చాలా స్పష్టంగా కనిపిస్తుందని సినిమా చూసిన ప్రతీ ఒక్కరూ చెప్తున్నారు.
అలా అని సినిమా బాలేదనట్లేదు కొన్ని ఎపిసోడ్స్ వరకు బావున్నాయట. కానీ ఆ కొన్ని సీన్స్ ను సినిమాను హిట్ అని చెప్పలేమంటున్నారు. ఈ ఫ్రాంచైజ్ లో వచ్చిన మొదటి రెండు సినిమాలను దృష్టిలో పెట్టుకోకుండా ఈ సినిమాను చూస్తే యావరేజ్ అనిపిస్తుంది కానీ వాటిలానే ఈ సినిమా కూడా ఉంటుందనుకుంటే మాత్రం ప్రేక్షకులకు నిరాశ తప్పదంటున్నారు ఏదేమైనా ఈ మూవీతో కూడా అక్షయ్ కుమార్ సక్సెస్ అందుకునేలా లేరు.