అకీరాకు యాక్టింగ్ ఇష్టం లేదట
ఒక స్టార్ హీరోకు కొడుకున్నాడంటే చాలు. ఆ పిల్లాడు పెద్దోడెప్పుడవుతాడు? హీరో ఎప్పుడవుతారని ఫ్యాన్స్ వెయిట్ చేస్తూ ఉంటారు. అలాంటిది పవన్ కళ్యాణ్ కొడుకు మీద ఏ రేంజ్ లో అంచనాలుంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పవన్, రేణు కొడుకైన అకీరా టీనేజ్లోనే మంచి ఫాలోయింగ్ సంపాదించాడు.
అకీరా ఎప్పుడైనా బయట కనిపిస్తే చాలు, ఆ ఫోటోలు నెట్టింట వైరల్ అవడం ఖాయం. ఇక తన బర్త్ డే కు పవన్ ఫ్యాన్స్ చేసే రచ్చ అంతా ఇంతా కాదు. ఇంత క్రేజ్ ఉన్న పవన్ వారసుడుకి యాక్టింగ్ ఇంట్రెస్ట్ లేదంటే ఫ్యాన్స్ ఒప్పుకునేట్లు కనిపించడం లేదు. ఇక అసలు విషయానికొస్తే, టైగర్ నాగేశ్వరరావు సినిమాలో ఓ కీలక పాత్ర చేసిన రేణు దేశాయ్ ఆ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటుంది.
ఈ సందర్భంగా రేణుకి అకీరా గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి. వాటికి సమాధానంగా రేణు, అకీరాకు యాక్టింగ్ పై ఇంట్రెస్ట్ లేదని, అతను ఫిల్మ్ మేకింగ్, మ్యూజిక్ లో ట్రైనింగ్ తీసుకుంటున్నాడని, పవన్, తను కూడా అకీరాను యాక్టింగ్ వైపు వెళ్లమని ఫోర్స్ చేయడం లేదని చెప్పుకొచ్చింది. రేణు చెప్పిన ఈ మాటలు పవన్ ఫ్యాన్స్ కు మింగుడు పడటం లేదు. ఎందుకంటే అకీరా కాబోయే స్టార్ హీరో అని ఫ్యాన్స్ ఎప్పుడో ఫిక్స్ అయ్యారు. అలాంటిది ఇప్పుడు ఒక్కసారిగా ఇలాంటి మాటలు చెప్తే మా పరిస్థితేంటని ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు.













