Akhanda2: ఫస్ట్ సింగిల్ పైనే అందరి కళ్లు
మాస్ ఆడియన్స్ కు ఎక్కడలేని కొత్త ఎనర్జీ తెచ్చే పేరు నందమూరి బాలకృష్ణ(nandamuri balakrishna). ఆయన స్క్రీన్ ప్రెజెన్స్, డైలాగ్ డెలివరీ ఆడియన్స్ ను ఎంతగానో ఆకట్టుకుంటాయి. అలాంటి బాలకృష్ణ తనకెన్నో సక్సెస్ఫుల్ సినిమాలను అందించిన బోయపాటి శ్రీను(Boyapati srinu) తో కలిసి అఖండ2(Akhanda2) సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించడానికి రెడీ అవుతున్నారు.
అఖండ(akhanda) సినిమాతో ఎన్నో రికార్డులు సృష్టించిన బాలయ్య(balayya)- బోయపాటి(boyapati) కాంబినేషన్ ఇప్పుడు మరోసారి ఆడియన్స్ ను ఆకట్టుకుని సరికొత్త రికార్డులు అందుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. డిసెంబర్ 5న అఖండ2 ప్రేక్షకుల ముందుకు రానుండగా, ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ గా తాండవం అనే పాటను ఇవాళ సాయంత్రం మేకర్స్ ముంబైలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారు.
ఆల్రెడీ ఈ తాండంవం(Thandavam) సాంగ్ ప్రోమో రిలీజవగా దానికి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. మొదటి సినిమా పాటలు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో థియేటర్లలో స్పీకర్లు బద్దలుకొట్టిన తమన్(thaman), ఇప్పుడు అఖండ2 తాండవం కోసం కూడా అదే స్థాయిలో మ్యూజిక్ ఇవ్వబోతున్నాడని అర్థమవుతుంది. అందుకే ఫస్ట్ సాంగ్ కోసం ఏకంగా స్టార్ సింగర్స్ అయిన కైలాష్ ఖేర్(Kailash kher), శంకర్ మహదేవన్(shankar Mahadevan) ను రంగంలోకి దింపారు. మరి ఈ సాంగ్ ఎలాంటి రెస్పాన్స్ ను అందుకుంటుందో? ఎన్ని రికార్డులను అందుకుంటుందో చూడాలి. కాగా అఖండ2 సినిమా డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.






