కంగువ సీన్స్‌కు అజిత్ థ్రిల్
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, యాక్షన్ సినిమాల డైరెక్టర్ శివ దర్శకత్వంలో కంగువ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. రూ.300 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్స్ జరుపుకుంటుంది. కోలీవుడ్ లోనే భారీ బడ్జెట్ సినిమాగా కంగువ ప్రేక్షకుల ముందుకు భారీ అంచనాలతో రానుంది.
ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్ కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ తో సైన్స్ ఫిక్షన్, ఫాంటసీ జానర్ లో కంగువ మూవీ కథాంశం ఉండబోతుందని తెలుస్తోంది. సూర్య ఈ సినిమాలో రెండు భిన్న పాత్రలను పోషిస్తున్నాడు. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన కొన్ని సీన్స్ ను స్టార్ హీరో అజిత్ చూశాడట.
ఆ సీన్స్ చూశాక అజిత్ ఎంతో థ్రిల్ అయ్యాడని, డైరెక్టర్ శివను ప్రశంసలతో ముంచెత్తాడని అంటున్నారు. అజిత్, శివ కాంబినేషన్ లో కోలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలొచ్చాయి. ఈ నేపథ్యంలో అజిత్ తో ఉన్న బాండింగ్ వల్లే శివ కంగువ సీన్స్ ను చూపించాడని తెలుస్తోంది. అజిత్ కు ఆ షాట్స్ విపరీతంగా నచ్చడంతో ఆయన కూడా ఈ సినిమాను ప్రమోట్ చేసే ఛాన్సుందని అంటున్నారు. కంగువ మూవీ ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు రానుంది.













