అజయ్‌కు రాజమౌళి స్వాగతం
బాలీవుడ్ యాక్షన్ హీరో అజయ్ దేవగణ్‌కు దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి స్వాగతం పలికారు. జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్ కథానాయికులుగా ఆయన దర్శకత్వం వహిస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్రంలో అజయ్ దేవగణ్ అతిథి పాత్రలో నటించనున్నారు. ఈ సినిమా షూటింగ్ కోసం అజయ్ దేవగణ్ హైదరాబాద్ సెట్‌కి వచ్చారు. షూటింగ్లో పాల్గొనున్న ఆయనకు రాజమౌళి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సెట్లో తీసిన ఫొటోలను చిత్ర బృందం సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ రోజు నుంచి అజయ్ జీతో కలిసి షెడ్యూల్ మొదలు పెట్టడానికి మా టీమ్ అంతా సూపర్ ఎగ్జైటింగ్‌గా ఎదురుచూస్తున్నాం. స్వాగతం సార్ అని ట్విట్టర్లో పేర్కొన్నారు. అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్, కొమరం భీమ్‌గా జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న ఈ చిత్రం బాలీవుడ్ నటి అలియాభట్, హాలీవుడ్ నటి ఒలీవియా మోరీస్ కథానాయికలుగా నటిస్తున్నారు. డీవీవీ దానయ్య భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.













