ఇనస్పెక్టర్పై సినీనటి ఫిర్యాదు…
కెమెరామెన్ చోటా కె నాయుడి సోదరుడిపై గతంలో కేసు పెట్టిన సినీనటి శ్రీసుధ ఇప్పుడు ఓ పోలీసు ఇనస్పెక్టర్పై ఏసిబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. హైదరాబాద్లోని సంజీవరెడ్డినగర్ పోలీసు ఇన్స్పెక్టర్ మురళీ కృష్ణ తన నుంచి లంచంగా డబ్బులు తీసుకున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. కొద్ది రోజుల క్రితం చోటా కె.నాయుడు తమ్ముడు శ్యామ్ కె.నాయుడు తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడని నటి శ్రీ సుధ ఎస్ఆర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసు దర్యాప్తు కోసం కలిసిన సమయంలో మురళీ కృష్ణ తన నుంచి డబ్బులు వసూలు చేశాడని తెలిపారు. అయితే తనకు హామీ ఇచ్చినట్టుగా ఈ కేసులో శ్యామ్ కె.నాయుడును అరెస్టు చేయకపోవడంతో పాటు కోర్టులో రాజీ కుదుర్చుకున్నట్లు నకిలీ లెటర్ సృష్టించారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. సీఐతో తాను వ్యక్తిగతంగా కలిసినప్పుడు మాట్లాడిన విషయాలకు సంబంధించిన సాక్ష్యాలను కూడా ఆమె ఏసీబీకి అందజేశారు.













