ఘనంగా ఆర్తి పెళ్లి
బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్, కోలీవుడ్‌లో సినిమాలు చేసిన హీరోయిన్ ఆర్తి చాబ్రియా వివాహం ఘనంగా జరిగింది. ఈ అందాల తార చార్టర్డ్ అక్కౌంటెంట్ విశరద్ బీడసేనను పెళ్లి చేసుకుంది. గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న వీరిద్దరూ చివరికి పెళ్లి చేసుకున్నారు. మొత్తం 25కి పైగా సినిమాల్లో నటించిన ఆర్తి చాబ్రియా తెలుగులో చింతకాయల రవి చిత్రంలో ఐటమ్ సాంగ్ చేయడంతో పాటు ఒకరికి ఒకరు, ఇంట్లో శ్రీమతి వీధిలో కుమారి, గోపీ గోడమీద పిల్లి తదితర చిత్రాల్లో నటించింది. ఇరు కుటుంబాల ఒప్పందంతో ఇద్దరు కూడా కొన్ని నెలల క్రితమే వివాహ నిశ్చితార్థం చేసుకున్నారు. వీరి పెళ్లి ఎప్పుడు అంటూ అందరూ ఎదురు చూస్తున్న సమయంలో హఠాత్తుగా ఆర్తి తన పెళ్లికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియా ద్వారా నెటిజన్స్‌తో పంచుకుంది. పెళ్లి తేదీని రహస్యంగా ఉంచి వివాహం అనంతరం ఫొటోలను విడుదల చేసింది ఈ అందాల తార.













