నేచర్ క్యూర్ ను సందర్శించిన నటుడు సోనూసూద్
హైదరాబాద్‌లోని అమీర్‌పేటలోని నేచర్ క్యూర్ ఆస్పత్రిని సినీ నటుడు సోనుసూద్ సందర్శించారు. ఆస్పత్రిలో కాటేజీలు, భోజనశాల, యోగా ప్రాంగణం తదితర ఆధునీకరణ పనులను పరిశీలించారు. వైద్యులు అందిస్తున్న సేవలు, ప్రకృతి సిద్ద వైద్య సేవల గురించి తెలుసుకున్నారు. ఆరోగ్య తెలంగాణగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దేందుకు సీఎం కేసీఆర్, మంత్రి హరీష్‌రావు ఆస్పత్రుల్లో వసతుల కోసం చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. ఆయన వెంట అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, టీఎస్ఎంఎస్ఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, ఆయుష్ కమిషనర్ ప్రశాంతి, నేచర్ క్యూర్ సిబ్బంది ఉన్నారు.













