పెళ్లి చేసుకుంటా.. పిల్లని వెతికిపెట్టండి
వరుడు, సైజ్ జీరో చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నటుడు ఆర్య. ఆయన తమిళంలో చేసిన ఒక రాజు ఒక రాణి మంచి పేరు తెచ్చి పెట్టింది. ఈ తమిళ్ హీరో ఇప్పుడు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడట. పాపం పిల్ల దొరకడం లేదట. ఆ విషయాన్ని ఓ వీడియా తీసి దాన్ని ట్విట్టర్లో పోస్టు చేశాడు. పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. పిల్లను వెతికి పెట్టడండి ప్లీజ్ అని తన అభిమానులను కోరారు. హాయ్ ఫ్రెండ్స్. మొత్తానికి నేను నా జీవిత భాగస్వామి కోసం వెతుకుతున్నాను. గత వారం జిమ్లో నాకు సంబంధించిన వీడియో ఒకటి నా స్నేహితులు పోస్ట్ చేశారు. ఆదేదో వారు సరదాగా చేశారు. కానీ ఆ వీడియోలో వాళ్లు చెప్పింది మాత్రం నిజం. సాధారణంగా కుటుంబీకులు, స్నేహితుల సాయంతో పెళ్లి సంబంధాల కోసం వెతుకుతుంటారు.కానీ నేను అలా కాదు. పెళ్లి విషయంలో నాకు ఎలాంటి డిమాండ్లు, షరతులు లేవు. మీకు నేను నచ్చితే, నేను మీకు చక్కటి జోడీ అవుతానని మీక అనిపిస్తే ఈ నెంబర్కు ఫోన్ చేయండి. ఇది జోక్ కాదు. నా జీవితం అని ఆర్య వీడియోలో పేర్కొన్నారు. ఆర్య ప్రస్తుతం సంఘమిత్ర చిత్రంలో కథానాయకుడిగా నటిస్తున్నాడు.













