Prasanth Neel: నీల్ పై పెద్ద బాధ్యత
సినీ ఇండస్ట్రీలో హీరోల లుక్స్ పై అందరి చూపూ ఉంటుంది. వారి లుక్ లో కాస్త మార్పు కనిపించినా దాన్ని చర్చనీయాంశంగా మారుస్తారు నెటిజన్లు. తమ సినిమాల కోసం యాక్టర్లు మేకోవర్ చేసినా, ఆ మేకోవర్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. కొందరు ఈ మేకోవర్ విషయంలో సినిమా రిలీజయ్యే వరకు ట్రోలింగ్ కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇప్పుడు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్(NTR) కూడా అదే పొజషన్ లో ఉన్నాడు.
ప్రశాంత్ నీల్(Prasanth Neel) దర్శకత్వంలో చేస్తున్న సినిమా కోసం ఎన్టీఆర్ చాలా భారీగా మేకోవర్ అయిన విషయం తెలిసిందే. ఒకప్పుడు ఎంతో లావుగా ఉండే తారక్(tarak), యమదొంగ(yamadonga) తర్వాత నుంచి కరెక్ట్ వెయిట్ ను మెయిన్టెయిన్ చేస్తూ ఎప్పటికప్పుడు మేకోవర్ అవుతూ వస్తున్నాడు. అయితే ఇప్పుడు ప్రశాంత్ నీల్ తో చేస్తున్న డ్రాగన్(dragon) కోసం ఎన్టీఆర్ మేకోవర్ చాలా కొత్తగా ఉంది.
ఆల్రెడీ లుక్స్ పరంగా కరెక్ట్ గా ఉన్న తారక్, ఇప్పుడు డ్రాగన్ కోసం ఏకంగా 60 కేజీలు తగ్గి, కెరీర్లో మునుపెన్నడూ లేనంత స్లిమ్ గా మారాడు. ఈ లుక్ ఆడియన్స్, ఫ్యాన్స్ కు నచ్చదని తెలిసినప్పటికీ, విమర్శలొస్తాయని గ్రహించినప్పటికీ డైరెక్టర్ నీల్ పై ఉన్న నమ్మకంతో ఎంతో కష్టపడి బరువు తగ్గాడు. దీని కోసం తారక్ రోజులో ఒక సారి మాత్రమే తింటున్నాడని సమాచారం. డ్రాగన్ కోసం తారక్ కెరీర్లో ఎప్పుడూ పడనంత కష్టాన్ని పడుతున్నారు. మరి నీల్ డ్రాగన్ తో తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటాడో లేదో చూడాలి.







