కల్కి కోసం 5 విఎఫ్ఎక్స్ కంపెనీలు
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ సినిమా కల్కి 2898ఏడి. పాన్ వరల్డ్ మూవీగా రానున్న ఈ సినిమా 22 ప్రపంచ భాషల్లో రిలీజ్ కానుంది. ఈ సినిమాలో కమల్ హాసన్, అమితాబ్, దీపికా పడుకొనె, దిశా పటానీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇవి కాకుండా మరిన్ని గెస్ట్ పాత్రలు కూడా ఉంటాయంటున్నారు.
భారీ బడ్జెట్ తో అశ్వినీ దత్ నిర్మిస్తున్న ఈ సినిమా రెండు భాగాలుగా రిలీజ్ కానుంది. ఇప్పటికే పార్ట్-1 షూటింగ్ పూర్తి చేసుకుని విఎఫ్ఎక్స్ వర్క్స్ ను పూర్తి చేసుకునే పనిలో ఉంది. ప్రస్తుతం పార్ట్-2కు సంబంధించిన షూటింగ్ జరుగుతుందని టాక్. ఫ్యూచరిస్టిక్ నేపథ్యంలో వచ్చే సినిమా కావడంతో కల్కి కోసం అడ్వాన్డ్స్ టెక్నాలజీలో ఈ ప్రపంచాన్ని నాగ్ అశ్విన్ ఊహాలోకం నుంచి చూపించబోతున్నాడు.
కల్కి కోసం ఏకంగా 5 విఎఫ్ఎక్స్ కంపెనీలు వర్క్ చేస్తున్నాయని సమాచారం. వాటిలో మూడు ఇండియన్ కంపెనీలు కాగా ఒకటి న్యూజిలాండ్, మరొకటి యూఎస్ కంపెనీ అని తెలుస్తోంది. వీరందరి నుంచి బెస్ట్ అవుట్‌పుట్‌ని తీసుకునే పనిలో నాగ్ అశ్విన్ ఉన్నాడు. మే 9న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాపై అందరికీ భారీ అంచనాలున్నాయి.













