Jo Sharma: ఇఫీ గోవాలో ఇండియన్ అమెరికన్ నటి జో శర్మ సందడి..
పనాజీ: గోవాలో జరిగిన అంతర్జాతీయ చలనచిత్రోత్సవం (IFFI-ఇఫీ) 56వ ఎడిషన్, వేవ్స్ ఫిల్మ్ బజార్ వేడుకలకు ఇండియన్ అమెరికన్ నటి జో శర్మ హాజరై సందడి చేశారు. ఈ ప్రతిష్టాత్మక వేదికపై ఆమె టాలీవుడ్ సూపర్ స్టార్ నందమూరి బాలకృష్ణ గారితో కలిసి హాజరయ్యారు.
‘లాల్ సలామ్’ స్క్రీనింగ్‌లో రజనీకాంత్‌తో కలిసి…
సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన ‘లాల్ సలామ్’ సినిమా స్క్రీనింగ్‌కు కూడా జో శర్మ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు శేఖర్ కపూర్ తోపాటు సినిమా బృందం పక్కనే కూర్చొని చిత్రాన్ని వీక్షించారు. ఈ వేడుకలను కేంద్ర సమాచార, ప్రసార శాఖ కార్యదర్శి సంజయ్ జాజు, డా. ఎల్. మురుగన్, అనుపమ్ ఖేర్, శేఖర్ కపూర్ వంటి ప్రముఖులు పర్యవేక్షించి, ప్రపంచవ్యాప్తంగా వచ్చిన డెలిగేట్లకు, సినీ నిపుణులకు ఘన స్వాగతం పలికారు.
గోవా ముఖ్యమంత్రితో ప్రత్యేక భేటీ
తన పర్యటనలో భాగంగా, జో శర్మ ఇఫీ పరేడ్‌లోనూ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్, గోవా పర్యాటక శాఖ మంత్రి రోహన్ ఖాంటేతో పాటు టాలీవుడ్ సినీ ప్రముఖులతో సంభాషించారు. ఈ సమావేశం ఇండియా, అమెరికా మధ్య సాంస్కృతిక, సినిమాపరమైన సహకారాన్ని మరింత బలోపేతం చేసింది.
28 అంతర్జాతీయ అవార్డులు గెలుచుకున్న ‘M4M’ హీరోయిన్
జో శర్మ ప్రధాన పాత్ర పోషించిన ‘M4M – మోటివ్ ఫర్ మర్డర్’ చిత్రం సంచలనాలు సృష్టిస్తోంది. మోహన్ వడ్లపట్ల దర్శకత్వం వహించిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్, ఏకంగా 28 అంతర్జాతీయ చలనచిత్రోత్సవ అవార్డులను గెలుచుకుంది. అంతేకాకుండా, జో శర్మ తన అద్భుత నటనకు 6 బెస్ట్ యాక్ట్రెస్ అవార్డులను సొంతం చేసుకున్నారు. ‘M4M’ త్వరలో థియేటర్లలో విడుదల కానున్న సందర్భంగా ఆమె శక్తివంతమైన పాత్రను చూడాలని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దీనితో పాటు, జో శర్మ ఆశీష్ జీ అధ్యక్షతన జరిగిన FICCI సెషన్లో కూడా పాల్గొన్నారు. గ్లోబల్ సినిమా, నిర్మాణం, క్రియేటివ్ ఎక్స్ఛేంజ్పై జరిగిన ఈ అర్థవంతమైన చర్చలో ఆమె తన వంతు సహకారాన్ని అందించారు. మల్టిపుల్ కీలక ఈవెంట్లలో తన చురుకైన భాగస్వామ్యంతో, జో శర్మ అంతర్జాతీయ సినీ వేదికపై ఇండియన్-అమెరికన్ ప్రతిభను చాటిచెప్పారు. ఆ






