Kash Patel :భారత్‌కు పూర్తి మద్దతు :ఎఫ్‌బీఐ డైరెక్టర్ కాశ్ పటేల్

పహల్గాంలో ఉగ్ర దాడిని అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐ డైరెక్టర్ కాశ్ పటేల్ (Kash Patel) ఖండిరచారు. ఈ విషయంలో భారత్ (India)కు పూర్తి మద్దతుగా నిలుస్తామని స్పష్టం చేశారు. ఉగ్రవాదం నుంచి ప్రపంచం ఎదుర్కొంటున్న బెదిరింపులను ఈ దాడి గుర్తు చేసిందని పేర్కొన్నారు. దాడి అనంతరం భద్రత దళాలు స్పందించిన తీరును ప్రశంసించారు. కశ్మీర్ (Kashmir)లో ఇటీవల జరిగిన దాడిలో మరణించిన వారికి ఎఫ్‌బీఐ (FBI) సంతాపం తెలుపుతోంది. భారత్ ప్రభుత్వానికి పూర్తిగా మద్దతుగా నిలుస్తోంది అని కాశ్ పేటల్ వ్యాఖ్యానించారు.