ఎట్టకేలకు ఉక్రెయిన్‌కు అమెరికా సాయం
రష్యాతో రెండేళ్లుగా సాగుతున్న యుద్ధంలో ఆయుధాలు, ఇతర కీలక సైనిక సామగ్రి కొరతతో సతమతమవుతున్న ఉక్రెయిన్‌కు శుభవార్త. ఆ దేశం సహా ఇజ్రాయెల్, తైవాన్లకు కలిపి మొత్తం 95.3 బిలియన్ డాలర్ల ( సుమారు 7.90 లక్షల కోట్లు) సాయం అందించేందుకు ఉద్దేశించిన ప్యాకేజీకి అమెరికా సెనేట్ ఆమోదం తెలిపింది. ఇందులో ఉక్రెయిన్‌కు 60 బిలియన్ డాలర్ల ( సుమారు రూ.4.98 లక్షల కోట్లు)ను ప్రత్యేకించారు. సొంత సమస్య లను పరిష్కరించడానికి బదులుగా ఇతర దేశాల సమస్యల కోసం నిధులను వెచ్చించడాన్ని రిపబ్లికన్ సభ్యులు కొందరు వ్యతిరేకించారు. దీనిపై చర్చించిన సెనేట్ చివరికి ఈ బిల్లుకు 70`29 ఓట్ల తేడాతో ఆమోదం తెలిపింది.






