ఉత్తర కరోలినాలో మొదటిసారి ఓటర్లకు రాయల్ ట్రీట్ మెంట్
షార్లెట్లోని బెట్టే రే థామస్ రిక్రియేషన్ సెంటర్ నందు అమెరికన్ పౌరులుగా మొదటిసారి ఓటు హక్కును వినియోగించుకున్న వారికి ప్రోత్సాహంగా వాలంటీర్లు వారిని ప్రశంసిస్తూ చిప్స్, డోనట్స్, టర్కీ శాండ్విచ్లు మరియు పానీయాల సంచులను అందించడం జరిగింది. ఓటు వేయడానికి గంటల తరబడి క్యూ లైన్ లో వేచి ఉండలేక ఇన్-పర్సన్ ఓటింగ్ అనుభూతి కోసం ఎలక్షన్ డే వరకు ఆగి మొదటిసారి ఓటు హక్కును వినియోగించుకున్న చాలా మంది పౌరులలో ఒకరు 19 సంవత్సరాల మిస్టర్ ముర్రే. విమానాశ్రయంలో ఉద్యోగ చేస్తున్న మిస్టర్ ముర్రే వాలంటీర్ల నుంచి ప్రశంసలు అందుకోవడం ఆనందంగా ఉంది అని మీడియా కు తెలిపారు. మిస్టర్ ముర్రే అధ్యక్షులుగా జోసెఫ్ ఆర్. బిడెన్ జూనియర్ కు మరియు గవర్నర్ కొరకు డెమొక్రాటిక్ పదవిలో ఉన్న రాయ్ కూపర్‌కు ఓటు వేసినట్లు న్యూ యార్క్ టైమ్స్ తెలిపింది.నార్త్ కరోలినా స్టేట్ బోర్డ్ ఆఫ్ ఎలక్షన్స్ ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 4.5 మిలియన్లకు పైగా ఉన్న ప్రజల లో ఎన్నికల రోజుకు ముందే మెయిల్ ద్వారా లేదా వ్యక్తిగతంగా ఓటింగ్ ద్వారా వేసిన ఓట్లు 62 శాతం మాత్రమే అని తెలిపారు.






