చెన్నూరులో శ్రీ కోదండరామ భజనమందిర నిర్మాణానికి భూమి పూజ
మచిలీ పట్నం జిల్లా, పెడన మండలంలో ఉన్న చెన్నూరు గ్రామంలో స్వర్గీయ చెన్నూరి వేంకట సుబ్బారావు గారు, స్వర్గీయ పుప్పాల లక్ష్మయ్య గారి కుటుంబాలు కలిసి వారి తాత ముత్తాతలు కట్టిన కోదండరామ దేవాలయంను పున్తరుద్దించి నడుపుతున్నారన్న విషయం గ్రామంలో అందరికీ తెలిసిందే! ఈ కుటుంబాలు గుడిలో నిత్య పూజలు, పండుగలు జరుపుతూ గుడిని గ్రామంలో ఒక ప్రధాన అంశంగా మార్చారు. పెడన మండలంలో అతి పెద్ద ఆయకట్టు ఉన్న గ్రామంగా గుర్తింప పడ్డా, చెన్నూరు కేవలం 4000 జనంతో ఉన్న చిన్న గ్రామం. చెన్నూరు చుట్టూరా ఉన్న వుర్వి, చెవురు, కమలాపురం, కొప్పల్లె, వడవల్లి, ముచ్చర్ల, దేవరం లాంటి గ్రామాలు అన్ని చిన్నవే.
చెన్నూరు గ్రామస్తుల కోరిక మీద చెన్నూరు గ్రామంలో శ్రీ కోదండ రామ దేవాలయంకు అనుబంధంగా శ్రీ కోదండరామ భజన మందిరం నిర్మించాలని, అది ఒక భజన మందిరంగా, కళ్యాణ మండపంగా చుట్టూ పక్కల అన్ని గ్రామాల వారికి ఉపయోగపడాలని శ్రీ కోదండరామ ట్రస్ట్ అధ్యక్షులు, శ్రీ చెన్నూరు వేంకట సుబ్బారావు అన్నారు.
ఇవి కూడా చదవండి
చెన్నూరు గుడిని నిర్వహిస్తున్న శ్రీ కోదండ రామ ట్రస్ట్, హైదరాబాద్ లో చెన్నూరి కుటుంబీకుల చెన్నూరి చారిటబుల్ ట్రస్ట్ లు రెండూ లాభాపేక్ష లేని స్వచ్ఛంద సేవా ట్రస్ట్ లని వాటి ద్వారా స్నేహితులు, కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషుల విరాళాలతో ఈ భజన మందిర నిర్మాణం జరుగుతుందని శ్రీ సుబ్బారావు తెలిపారు. కుటుంబ సభ్యుల విరాళాలతో చెన్నూరు గ్రామంలో శ్రీ కోదండ రామ దేవాలయంకు దగ్గరలో 34 సెంట్ల స్థలం కొన్నామని, దాదాపు 100 కు పైగా టిప్పర్ల మట్టి తెప్పించి నెలను చదును చేశామని కూడా తెలిపారు.
గురువారం, 23 ఏప్రిల్ 2026 వ తేదీన భూమి పూజ చేసి దాదాపు 60 లక్షల రూపాయల వ్యయంతో ఈ నిర్మాణం మొదలెట్టామని శ్రీ చెన్నూరి వెంకట బాల కృష్ణ తెలిపారు.. గ్రామాల అభివృద్ధి కి ఇలాంటి సదుపాయాలు అవసరం అని, దాతలు ముందుకు వచ్చి మేము చేస్తున్న ఈ కార్యక్రమానికి తమవంతు సహాయం చేయటానికి ముందుకు రావాలని శ్రీ బాల కృష్ణ అన్నారు. ఈ భజన మందిరం లో దాదాపు 100 కుపైగా కూర్చునే సదుపాయం ఉంటుందని, భోజనశాల కూడా ఉంటుందని, గుడి పూజారి గారు, భజన మందిరం మానేజర్ లు కూడా ఈ ప్రాంగణంలో నివాసం ఉండేలా ఏర్పాటు చేస్తున్నామని శ్రీ పుప్పాల రవి కుమార్ తెలిపారు. ఈ భజనమందిరం నిర్మాణం పట్ల చెన్నూరు గ్రామస్తులు హర్షం వ్యక్తంచేశారు.
ఈ నిర్మాణానికి సంబంధించిన ఇతర వివరాýకోసం చెన్నూరి వెంకట సుబ్బారావును 9849599625 లో సంప్రదించవచ్చు.
ఇవి కూడా చదవండి






