అమెరికాకు ‘ఆధార్’
భారతీయుల ఆధార్ సమాచారం అమెరికాకు అందుబాటులో ఉందంటూ వికీలీక్స్ సంచలన వ్యాఖ్యలు చేసింది. అమెరికాకు చెందిన సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (సీఐఏ)కి చెందిన గూఢచారులకు ఆధార్ డేటాబేస్ అందుబాటులో ఉందని ట్వీటర్లో ఆరోపించింది. ఆధార్ డేటాబేస్ను అందుబాటులోకి తెచ్చుకునేందుకు సీఐఏ.. అమెరికాకు చెందిన క్రాస్ మ్యాచ్ టెక్నాలజీస్ కంపెనీని వాడుకుంటున్నట్లు పేర్కొంది. గోప్యత ప్రాథమిక హక్కేనని సుప్రీం కోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో వికీలీక్స్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అయితే ఈ ఆరోపణలు నిరాధారమైనవని భారత్ ఖండించింది.













