ఉపరాష్ట్రపతిగా వెంకయ్య నామినేషన్
ఎన్డీయే పక్షాల తరపున ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న ఎం.వెంకయ్య నాయుడు నామినేషన్ దాఖలు చేశారు. రెండు సెట్ల నామినేషన్ పత్రాలు రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. తొలి సెట్‌పై ప్రధానమంత్రి మోదీ సంతకంగా చేయగా, రెండో సెట్‌పై రాజ్‌నాథ్ సింగ్ సంతకం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, సీనియర్ నేతలు ఎల్కే అడ్వాణీ, ఎంఎం జోషి, సుష్వా స్వరాజ్ సహా పలువురు కేంద్ర మంత్రులు తరలిరాగా ఆయన పార్లమెంటులో నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి పలువురు ఎన్డీయే నేతలు కూడా హాజరయ్యారు. వచ్చే నెల 5న ఉపరాష్ట్రపతి పదవి కోసం ఎన్నికలు జరగనున్నాయి. యూపీఏ తరపున పోటీచేస్తున్న గోపాలకృష్ణ గాంధీతో వెంకయ్య పోటీపడనున్నారు.













