ప్రశ్నిస్తే దాడులు చేస్తారా?.. మేం ప్రభుత్వాలు నడపలేదా?
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిలను పోలీసులు అరెస్టు చేయడంపై ఆమె తల్లి వైఎస్ విజయమ్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విజయమ్మ మీడియాతో మాట్లాడుతూ వైఎస్ షర్మిల చేసిన నేరం ఏంటి? అని ప్రశ్నించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే దాడులు చేస్తారా? అని ప్రశ్నించారు. మేం ప్రభుత్వాలు నడపలేదా? మాకు పోలీసులు కొత్తకాదు అన్నారు. పోలీసులు ఇలా చేయడం తప్పు కాదా? అని ప్రశ్నించారు. వ్యక్తిగతంగా ఏం విమర్శ చేసిందో మీరే చెప్పండి. ప్రజలు చెప్పిన సమస్యలనే షర్మిల ప్రశ్నించింది అన్నారు. ప్రజల కోసం పనిచేయడం రాజ్యాంగం కల్పించిన హక్కు అన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కును ఎవరూ తీసేయలేరని పేర్కొన్నారు. మహిళపై దాడి జరిగినప్పుడు ప్రతి నాయకుడు స్పందిస్తారు. అందులో భాగంగానే బండి సంజయ్ స్పందించారు. నా కుమార్తెకు అండగా ఉంటాను అని స్పష్టం చేశారు.













