రెండో రోజూ కొనసాగుతున్న షర్మిల దీక్ష
తెలంగాణ నిరుద్యోగుల సమస్యలను పరిష్కారించాలంటూ వైఎస్ షర్మిల చేపట్టిన ఉద్యోగ దీక్ష రెండో రోజూ కొనసాగుతోంది. లోటస్‌పాండ్‌లో ఆమె రెండో రోజు దీక్షను కొనసాగిస్తున్నారు. మొదటి రోజు గురువారం ఇందిరా పార్క్ వద్ద దీక్ష చేపట్టారు. అయితే మూడు రోజుల పాటు దీక్ష కొనసాగుతుందని షర్మిల సంచలన ప్రకారం చేశారు. దీంతో పోలీసులు అనుమతిని నిరాకరించారు. దీనిని నిరసిస్తూ ఆమె ఇందిరా పార్క్ నుంచి లోటస్‌పాండ్ వరకూ పాదయాత్ర చేపట్టారు. ఈ సమయంలో పోలీసులు, అభిమానులకు మధ్య తీవ్ర తోపులాట జరిగింది. ఈ తోపులాటలో షర్మిల సొమ్మసిల్లి కిందపడిపోయారు. ఆమె చేతికి కూడా గాయమైంది. ఆమెను అరెస్ట్ చేసి బేగంపేట మహిళా పీఎస్‌కు తరలించారు. ఆ తర్వాత ఆమె లోటస్‌పాండ్‌కు చేరుకున్నారు. అప్పటి నుంచే ఆమె తన దీక్షను కొనసాగిస్తున్నారు. దీక్షలో ఉన్న షర్మిలకు వైద్యులు పరీక్షలు నిర్వహించారు. ప్రాణం పోయినా మంచి నీళ్లు ముట్టుకోనని, 72 గంటల పాటు దీక్ష చేసి తీరుతానని షర్మిల స్పష్టం చేశారు.













