వైఎస్ షర్మిల అరెస్ట్… పీఎస్ కు తరలింపు
నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించాలంటూ వైఎస్ షర్మిల హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద దీక్ష చేపట్టారు. షెడ్యూల్ ప్రకారం దీక్ష గురువారం సాయంత్రం 5 గంటల కల్లా ముగియాల్సి ఉంది. అయితే హఠాత్తుగా షర్మిల సంచలన ప్రకటన చేశారు. 72 గంటల పాటు దీక్షను కొనసాగిస్తామని ప్రకటించారు. అయితే పోలీసులు మాత్రం అనుమతిని నిరాకరించారు. దీనిని నిరసిస్తూ వైఎస్ షర్మిల ఇందిరాపార్క్ నుంచి లోటస్ పాండ్ వరకూ పాదయాత్ర నిర్వహించారు. దీనిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ సమయంలో పోలీసులకు, షర్మిలకు మధ్య తోపులాట జరిగింది. అయినా ఆమె పాదయాత్ర చేసేందుకే ప్రయత్నించారు. ఈ తోపులాటలో వైఎస్ షర్మిళ స్పృహతప్పి పడిపోయారు. తేరుకున్నాక షర్మిలను పోలీసులు అరెస్ట్ చేసి బేగంపేట మహిళా పోలీస్ స్టేషన్కు తరలించారు.













