యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్‌కు సినారె పురస్కారం

డాక్టర్ సినారె పురస్కారాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికా భాషా సంఘం పూర్వ అధ్యక్షుడు డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్‌కు ప్రదానం చేశారు. హైదరాబాద్ నాంపల్లి పబ్లిక్‌గార్డెన్స్‌లోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నందమూరి తారక రామారావు కళా మందిరంలో రసమయి సంస్థ సి.నారాయణరెడ్డి 93వ జయంత్యుత్సవ సభను నిర్వహించింది. కేంద్ర మాజీ మంత్రి సముద్రాల వేణుగోపాలాచారి అధ్యక్షతన జరిగిన ఈ వేడుకలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి డాక్టర్ కేవీ రమణాచారి, యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్‌కు సినారె పురస్కారాన్ని అందజేసి సత్కరించారు. ఈ కార్యక్రమంలో రసమయి సంస్థ అధ్యక్షుడు డాక్టర్ ఎం.కె.రాము, ఏపీ కళారత్న అవార్డు గ్రహీత ఎంకేఆర్ ఆశాలత పాల్గొన్నారు.