అమెరికాలో ప్రదర్శనకు తెలంగాణ కళాఖండం

తెలంగాణలో ఉన్న అద్భుతమైన కళాఖండాలకు ప్రాచుర్యం లభిస్తోంది. అంతర్రాష్ట్ర ప్రదర్శనల్లో, ఇతర చోట్ల నిర్వహిస్తున్న ప్రదర్శనల్లో తెలంగాణ కళాఖండాలను చూసేవారి సంఖ్య బాగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ ప్రదర్శనల్లో తెలంగాణ కళాఖండాలను ప్రదర్శిస్తే మరింత ప్రాచుర్యం లభించడం ఖాయం. ముంబయిల త్వరలో నిర్వహించే ఇండియా అండ్ ది వరల్డ్‌కు సూర్యాపేట జిల్లాలోని ఫణిగిరిలోని బుద్ధుడి శిల్పం ఇప్పటికే ఎంపికైన సంగతి తెలిసిందే. న్యూయార్క్‌లో 2020 లో నిర్వహించే అంతర్జాతీయ ప్రదర్శనలో ఈ శిల్పకళాఖండాన్ని ప్రదర్శించే విషయమై పరిశీలన జరుగుతోంది. సూర్యాపేట జిల్లా నాగారం మండలం ఫణిగిరి బౌద్దారామానికి చారిత్రకంగా ప్రాధాన్యముంది. ఇది ఒకటో శతాబ్దం నాటిదిగా నిపుణులు తేల్చారు.
ప్రధానంగా 2005 సంవత్సరంలో, అంతకుముందూ ఫణిగిరిగుట్టపై జరిపిన తవ్వకాల్లో నాటి కట్టడాలు, శిల్పాలు వెలుగుచూశాయి. బుద్ధుని జీవితంలో కీలకఘట్టాలు విభజిస్తూ చెక్కిన అద్భుతమైన శిల్పం హైదరాబాద్‌లో పురావస్తుశాఖ ప్రదర్శనశాలలో భద్రపరచగా మిగిలిన ఫణిగిరిలోని ఓ ఇంట్లో ఉన్నాయి. నవంబరు 11 నుంచి ముంబయిలో జరిగే ఇండియా అండ్ ది వరల్డ్‌కు ఫణిగిరి బుద్ధుడి శిల్పం ఎంపిక కావడంతో దీన్ని అక్కడికి పంపించారు. గత అనుభవాల దృష్ట్యా తెలంగాణ పురావస్తుశాఖ జాత్త్రలు తీసుకుంటోంది. రూ.రెండు కోట్లకు పైగా విలువైన ఈ శిల్పానికీ బీమా చేయించి ప్రీమియం కింద రూ.8.50లక్షలు చెల్లించారు. ఇదిలా ఉండగా రాaష్ట పర్యాటకశాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశంతో న్యూయార్క్ మెట్రోపాలిటన్ మ్యూజియం ప్రతినిధి జాన్గై హైదరాబాద్‌లో సమావేశమయ్యారు. న్యూయార్క్‌లో 2020 నిర్వహించే అంతర్జాతీయ ప్రదర్శనపై ఆయనకు వివరించారు. రాష్ట్ర నుంచి కళాఖండాన్ని ప్రతిపాదించాలని కోరినట్లు సమాచారం.











































































