రాష్ట్ర గిడ్డంగుల శాఖ కార్పొరేషన్ చైర్పర్సన్ గా సాయిచంద్ భార్య
తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల శాఖ కార్పొరేషన్ చైర్‌పర్సన్‌గా వేద రజని నియామకం కానుంది. ఆ సంస్థ చైర్మన్‌గా ఉన్న గాయకుడు సాయిచంద్ ఇటీవలే గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సాయిచంద్ భార్య రజనికే ఆ పోస్టును ఇవ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. కేసీఆర్ ఆదేశాల మేరకు సాయిచంద్ భార్య రజనిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనుంది. సాయిచంద్ కుటుంబానికి రూ.కోటిన్నర ఆర్థిక సాయాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. ఈ మొత్తాన్ని తమ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు ఒక నెల వేతనం నుంచి సమకూరుస్తున్నట్లు కేటీఆర్ వెల్లడిరచారు.













