అది నిరూపిస్తే తన సీపీ పదవికి రాజీనామా
తెలంగాణలో టెన్త్ క్లాస్ పేపర్ లీక్ వ్యవహారానికి సంబంధించి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన ఆరోపణలపై వరంగల్ సీపీ రంగనాథ్ స్పందించారు. ఈ కేసుకు సంబంధించిన తాను సెటిల్మెంట్లు చేసినట్లు ఆరోపించారని, అది నిరూపిస్తే తన సీపీ పదవికి రాజీనామా చేస్తానని అన్నారు. ఈ సందర్భంగా సీపీ మీడియాతో మాట్లాడుతూ తాను సెటిల్మెంట్లు చేసినట్లు నిరూపించాలని సవాల్ విసిరారు. తనకు బీజేపీ వాళ్లపై తప్పుడు కేసులు పెట్టాలనే ఉద్దేశం లేదని, రాజకీయాలకు అతీతంగా పని చేస్తున్నానని తెలిపారు. తాను ఎవరి పక్షాన ఉంటానో ప్రజలకు తెలుసని, కొన్ని కేసుల్లో కఠిన చర్యలు తీసుకోవడం వల్లే వారికి బాధ కలిగి ఉండొచ్చని అన్నారు. సత్యంబాబు కేసులో తాను విచారణ అధికారిని కాదని, స్పెషల్ ఆఫీసర్గా నందిగామకు పంపించారన్నారు. ప్రతి కేసులో ప్రమాణాలు చేస్తే తాను ఇప్పటి వరకు 10 వేల సార్లు చేయాలని, ప్రమాణం అనే మాట వినడానికే ఆశ్చర్యం వేస్తోందన్నారు.













