శుభవార్త… సమతామూర్తి ఉచిత దర్శనం
తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్ శ్రీరామనగరంలో సమతామూర్తి రామానుజాచార్య సహస్రాబ్ది ఉత్సవాలు ముగిశాయి. దీంతో సమతా కేంద్రం సందర్శనకు భక్తులకు అనుమతించారు. ఈ నెల 19 వరకు సమతామూర్తి, 108 దివ్వక్షేత్రాలను ఉచితంగా దర్శించవచ్చని నిర్వాహకులు తెలిపారు. మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6:30 గంటలకు దర్శనానికి అనుమతి ఉంటుందని వెల్లడించారు. అయితే ప్రస్తుతం రామానుజాచర్యుల స్వర్ణమూర్తి దర్శనానికి అనుమతి లేదని తెలిపారు. అదేవిధంగా సాకేంతిక కారణాలతో త్రీడీ మ్యాపింగ్ షోను తాత్కాలికంగా నిలిపివేస్తున్నామని, త్వరలోనే స్వర్ణమూర్తితో పాటు త్రీడీ లేజర్ షోను అందుబాటులోకి తెస్తామని తెలిపారు. త్వరలో టికెట్ ధరలను నిర్ణయిస్తామని వెల్లడించారు.













