కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ దీక్ష విరమణ
హైదరాబాద్‌లోని పంజాగుట్టలో అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు చేయాలంటూ నిరవధిక దీక్షకు దిగిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ వి.హనుమంతరావు (వీహెచ్) దీక్ష విరమించారు. తన నివాసంలోనే ఆయన నాలుగు రోజులుగా దీక్ష కొనసాగించారు. ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని దీక్ష విరమించాల్సిందిగా తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణికం ఠాగూర్ వీహెచ్‌కు సూచించారు. దీంతో మాణికం ఠాగూర్ ఆయనకు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. ఈ సందర్భంగా ఠాగూర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ తరపున ఈ పోరాటాన్ని కొనసాగిస్తామన్నారు. అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు విషయంలో కేసీఆర్ కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరు సరిగాలేదని విమర్శించారు. 70 ఏళ్ల వయసులో వీహెచ్ నిరాహార దీక్షకు దిగారని, కరోనా సమయంలో దీన్ని కొనసాగించడం సరికాదని భావించి ఆయనతో విరమింపజేశామన్నారు. వీహెచ్‌కు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని అన్నారు.













