ఆయన జీవితం భవిష్యత్ తరాలకు ఆదర్శం : వెంకయ్య నాయుడు

విలువలతో కూడిన జర్నలిజానికి నిదర్శంగా నిలిచిన బహుముఖ ప్రజ్ఞాశాలి రామోజీరావు అని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కొనియాడారు. రామోజీరావు జయంతి సందర్భంగా నివాళులర్పించారు. అడుగు పెట్టిన ప్రతి రంగంలోనూ విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. మీడియా మొదలుకుని అనేక రంగాల్లో వారు వేసిన బాటలు నేటికీ ఆదర్శంగా, ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాయి. వ్యక్తిగా మొదలై శక్తిమంతమైన వ్యవస్థగా ఎదిగిన రామోజీరావు జీవితం భవిష్యత్ తరాలకు ఆదర్శనీయం అని వెంకయ్య నాయుడు తెలిపారు.