ఢిల్లీ నడిబొడ్డున తెలంగాణ పతాకం
నేడు దేశ రాజధాని ఢిల్లీ నడిబొడ్డున రాష్ట్ర కీర్తిని ఎగురవేసేలా తెలంగాణ పతాకాన్ని సిఎం కెసిఆర్ ఎగురవేశారని రాష్ట్ర రోడ్లు, -భవనాలు గృహ నిర్మాణ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ కార్యాలయ నిర్మాణానికి టిఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కెసిఆర్ భూమి గురువారం భూమి పూజ కార్యక్రమంలో టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్, మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్యేలు,ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి వేముల మాట్లాడుతూ పార్టీ కార్యాలయ భవనం నమూనాలు కొన్ని సిద్ధమయ్యాయని, నమూనాలను పార్టీ అధ్యక్షుడు కెసిఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్‌లు పరిశీలించి తుది నిర?యం తీసుకుంటారన్నారు. ప్లాన్ ఓకే చేసిన వెంటనే నిర్మాణ పనులు మొదలవుతాయన్నారు. సిఎం కెసిఆర్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల అమలుకు పలు రాష్ట్రాలు ఆసక్తి చూపుతున్నాయన్నారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయన్నారు. ఢిల్లీలో టిఆర్ఎస్ పార్టీ కార్యాలయ నిర్మాణంలో భాగస్వామ్యం కల్పించినందుకు తాను కూడా ఒక కార్యకర్తగా గర్వపడుతున్నానన్నారు.













