బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడా… అమలు కావడం లేదు
తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడా అమలు కావడం లేదని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో వ్యవసాయానికి 24 గంటల విద్యుత్, రైతుబంధు, రైతుబీమా, ఇంటింటికీ రక్షిణ మంచినీరు, ఆసరా పెన్షన్లు, కేసీఆర్ కిట్, కల్యాణలక్ష్మి షాదీ ముబారక్ పథకాలు బీజేపీ పాలిత రాష్ట్రాలో ఎక్కడైనా అమలవుతుంటే చూపాలని సవాల్ విసిరారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా అమలవుతుంటే చూపాలని రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కి సవాల్ విసిరారు. ప్రజల మధ్య విద్వేషాలు, వైషమ్యాలను పెంచి పోషించడం, రెచ్చగొట్టడం తప్ప బీజేపీ నాయకులు చేసిందేమి ఉండదని ఎద్దేవా చేశారు.













