ముందు ఎన్నికల్లో గెలవండి.. తర్వాత సీఎం పంచాయితీ
పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నామినేషన్ సందర్భంగా కామారెడ్డిలో జరిగిన బీసీ డిక్లరేషన్ సభలో కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వి.హనుమంతరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్లో ఎవరికీ వారే నేను సీఎం అంటున్నారు. కాంగ్రెస్ నేతలు నేనే సీఎం అనడం మానేయాలి. ఠాక్రేజీ నేతలందరికీ ఈ సీఎం గోల ఆపమని చెప్పండి. కాంగ్రెస్లో సీఎంను అధిష్ఠానం నిర్ణయిస్తుంది. నాకు కూడా గతంలో సీఎం అవకాశం వచ్చిపోయింది. ముందు ఎన్నికల్లో గెలవండి, తర్వాత సీఎం పంచాయితీ అని పార్టీ నేలకు వీహెచ్ చురకలంటించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని వీహెచ్ ధీమా వ్యక్తం చేశారు.













