హెచ్‌సీయూకు మరో అంతర్జాతీయ గుర్తింపు.. విదేశీ విద్యార్థులకు

హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్‌సీయూ) మరొక అంతర్జాతీయ గుర్తింపును సొంతం చేసుకుంది. విదేశీ విద్యార్థులకు అనువైన టాప్ 12 శాతం యూనివర్సిటీల్లో చోటు దక్కించుకుంది. ప్రపంచంలోనే అత్యుత్తమ విలువలు కలిగిన విశ్వవిద్యాలయాలకు స్టడీ అబ్రాడ్ ఎయిడ్ సంస్థ ఇచ్చిన 2024 ర్యాంకింగ్స్‌లో భారత దేశం నుండి అత్యుత్తమ ర్యాంకు పొందిన విశ్వవిద్యాలయంగా హెచ్‌సీయూ నిలిచింది. ఆసియా ఖండంలో 20 దేశాల్లోని 3,349 విద్యా సంస్థలను విశ్లేషించిన ఆ సంస్థ హెచ్‌సీయూ టాప్ 12 శాతం విశ్వవిద్యాలయాల్లో ఒకటిగా గుర్తించింది.