ఎంఐఎం అంటే టీఆర్ఎస్ కు భయం : స్మృతి ఇరానీ
టీఆర్ఎస్ అరాచకపాలనకు చరమగీతం పాడాలని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ అన్నారు. హుస్నాబాద్‌లో ఏర్పాటు చేసిన బహిరంగసభకు స్మృతి ఇరానీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణలో నిరుద్యోగ సమస్య పెరిగిందన్నారు. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీతో రైతులకు యూరియా అందించామన్నారు. దేశంలో ఒక్కరుకూడా ఆకలితో ఉండకూదని ఉచిత రేషన్ ఇచ్చామని పేర్కొన్నారు. నిరుద్యోగ భృతి ఇస్తానన్న కేసీఆర్ హామీ నిలబెట్టుకోలేదని మండిపడ్డారు. రూ.3వేల భృతి ఇస్తామన్న కేసీఆర్ ఇస్తున్నారా? అని ప్రశ్నించారు. టీఆర్ఎస్ ప్రభుత్వ స్టీరింగ్ ఎంఐఎం చేతిలో ఉందన్నారు. దళితులకు టీఆర్ఎస్ ప్రభుత్వం మొండి చెయ్యి చూపిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం సెప్టెంబరు 17న విలీనదినం నిర్వహించట్లేదు. ప్రధాని ఆవాస్ యోజన పథకం కింద ఇల్లు నిర్మించుకునేందుకు ఆర్థిక సాయం చేస్తున్నామన్నారు. పేదలు ఇల్లు నిర్మించుకునేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఏమైనా సాయం చేసిందా? అని ప్రశ్నించారు.













