గిరిజన రిజర్వేషన్ల పెంపుపై కేంద్రం క్లారిటి!
తెలంగాణ రాష్ట్రంలో గిరిజన రిజర్వేషన్ల పెంపుపై కేంద్ర ప్రభుతం స్పష్టత ఇచ్చింది. రాష్ట్రంలో గిరిజన రిజర్వేషన్లను పెంచుతూ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టులో ఉన్న కేసులు పరిష్కారం తర్వాతే గిరిజన రిజర్వేషన్లు పెంపుపై నిర్ణయం తీసుకుంటామని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. లోక్సభలో టీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అర్జున్ ముండా లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. తెలంగాణలో గిరిజన రిజర్వేషన్లు పెంపుకు సంబంధించిన బిల్లు కేంద్ర ప్రభుత్వానికి అందింది. ఆ రిజర్వేషన్లకు 10 శాతం వరకు పెంచాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిన బిల్లు కేంద్ర హోం శాఖకు చేరింది. రిజర్వేషన్లకు సంబంధించిన కొన్ని కేసులు ప్రస్తుతం సుప్రీంకోర్టులో పెండిరగ్లో ఉన్నాయి, అత్యున్నత న్యాయస్థానంలో కేసుల పరిష్కారం తర్వాతే దీనిపై ముందుకు వెళ్లాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయంతీసుకుంది అని కేంద్ర మంత్రి అర్జున్ ముండా తెలిపారు.













