జీ 20 అంతర్జాతీయ సదస్సు… ఏర్పాట్లపై సమీక్ష
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారిని కేంద్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి మనోజ్ అహుజా మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ ఏడాది జూన్ 15 నుంచి 17వ తేదీ వరకు హైదరాబాద్లో జరగనున్న జీ 20 అంతర్జాతీయ శిఖరాగ్ర సదస్సు ముందస్తు ఏర్పాట్లపై మనోజ్ అహుజా సమీక్షించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో వ్యవసాయ రంగంలో వచ్చిన విప్లవాత్మక మార్పులు, పెద్ద ఎత్తున వ్యవసాయోత్పత్తుల వివరాలను మనోజ్ అహుజాకు సీఎస్ శాంతికుమారి అందించి, వివరించారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు కూడా ఉన్నారు.













