తెలంగాణలో ఐఏఎస్, ఐపీఎస్ లను ఎంపిక చేసిన ఈసీ
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేళ కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) కొత్తగా ఐపీఎస్, ఐఏఎస్ అధికారులను ఎంపిక చేసింది. రాష్ట్ర ప్రభుత్వం పంపిన జాబితా నుంచి ఒక్కో పోస్టుకు ఒకరిని ఎంపిక చేసి వివరాలను రాష్ట్రానికి పంపించింది. హైదరాబాద్ పోలీస్ కమిషనర్గా సందీప్ శాండిల్య నియామకం అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం సందీప్ శాండిల్య పోలీసు అకాడమీ డైరెక్టర్గా ఉన్నారు. ఈసీ ఆదేశాలను అనుగుణంగా ఉత్తర్వులు జారీ అయ్యాయి. రాష్ట్రం పంపిన ప్యానల్ నుంచి అధికారులను ఈసీ ఎంపిక చేసింది. యాదాద్రి కలెక్టర్గా హనుమంత్, నిర్మల్ కలెక్టర్గా ఆశీష్ సంగ్వాన్, రంగారెడ్డి కలెక్టర్గా భారతీ హోలీకేరి, మేడ్చల్ కలెక్టర్గా గౌతం, రవాణా శాఖ ముఖ్య కార్యదర్శిగా వాణీ ప్రసాద్, ఎక్సైజ్, వాణిజ్య పన్నుల శాఖ ముఖ్య కార్యదర్శిగా సునీల్ శర్మ, ఎక్సైజ్ కమిషనర్గా జ్యోతి బుద్ధ ప్రకాశ్, వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్గా క్రిస్టినా నియామకం అయ్యారు.
పోలీసు కమిషనర్లు, ఎస్సీల జాబితా :
వరంగల్ పోలీసు కమిషనర్-అంబర్ కిషోర్ ఝా, నిజామాబాద్ పోలీసు కమిషనర్-కల్మేశ్వర్ సింగేనేవర్, సంగారెడ్డి ఎస్పీ-చెన్నూరి రూపేశ్, కామారెడ్డి ఎస్పీ-సింధూ శర్మ, జగిత్యాల ఎస్పీ-సంప్రీత్ సింగ్, మహబూబ్నగర్ ఎస్పీ-హర్షవర్ధన్, నాగర్కర్నూల్ ఎస్పీ-వైభవ్ రఘునాథ్, జోగులాంబ గద్వాల్ ఎస్పీ-రితిరాజ్, మహబూబాబాద్ ఎస్పీ- పాటిల్ సంగ్రామ్ సింగ్ఖ గణపతి రావ్, నారాయణపేట ఎస్పీ-యేగేష్ గౌతమ్, భూపాలపల్లి ఎస్పీ-కిరణ్ ప్రభాకర్, సూర్యాపేట ఎస్పీ-రాహుల్ హేగ్డే.













